Telangana Latest News: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించే వస్తువుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు అధికారులకు కీలక సూచనలు చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులు 22 వస్తువులతో కూడిన పూర్తి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశం తెలంగాణ విద్యారంగంలో మరో మైలురాయిగా నిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాలల బలోపేతం చేయడం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేపడుతోందని వివరించారు. జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణకు ప్రత్యేక విద్యా విధానాన్ని తీసుకురావాలని సీఎం తెలిపారు. ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులపై ప్రొక్యూర్మెంట్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…” విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు” అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తయారు కావాలంటే, విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. యూనిఫామ్‌తోపాటు 21 ఇతర వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కిట్‌లో స్కూల్ బెల్ట్, టై, షూస్,స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, పెన్సిల్స్, హోల్డర్, జ్యామిట్రీ బాక్స్ కలర్ పెన్సిల్స్, స్కెచ్ బుక్, హెల్త్ కిట్(ఇందులో బ్యాండ్ ఎయిడ్, సానిటైజర్), రైన్ కోట్, అంబ్రెల్లా వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులన్నీ నాణ్యమైనవిగా,దీర్ఘకాలం ఉపయోగపడేవిగా ఉండాలని ఆయన ఆదేశించారు.
తెలంగాణలో సుమారు 26వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చినవారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు అందుబాటులో ఉండే సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో లేకపోవడం వల్ల చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మన ఊరు- మన బడి పథాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పాఠశాలలు భవనాలు, ఫర్నీచర్, ల్యాబ్‌లు, లైబ్రరీలు అభివృద్ధి చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు 22 వస్తువులతో మరో పథకాన్ని అందిస్తున్నారు.
పెండింగ్ బిల్లుల విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ బిల్లుల చెల్లించకపోతే సరఫరాదారులు మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. అందుకే సకాలంలో వాటిని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇంకా చదవండి