
హైదరాబాద్: సంక్రాంతి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. డీఏను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2024 జులై 1 నుంచి వర్తించనుంది. జనవరి నెల వేతనంతో పెరిగిన డీఏను ప్రభుత్వం ఫిబ్రవరి 1న చెల్లించనుంది. 2023 జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.
2026 ఏప్రిల్ 30లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు డీఏ బకాయిలను 30 సమాన వాయిదాల్లో చెల్లింపులు ప్రభుత్వం ప్రారంభించింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొంది సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిల్లో 10 శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయనున్నారు. మిగిలిన 90 శాతం బకాయిలను 2026 ఫిబ్రవరి 1 నుంచి 30 సమాన వాయిదాల్లో చెల్లించనుంది. పింఛన్‌దారులకు పెరిగిన డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్) మొత్తం ఫిబ్రవరి 1న చెల్లించనుంది. అంతకుముందు ఉన్న డీ ఏరియర్స్ ఫిబ్రవరి 1 నుంచి 30 వరకు సమాన వాయిదాల్లో చెల్లింపులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రకటించింది.