ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ని హైదరాబాద్.. నందినగర్‌లోని ఆయన ఇంట్లోనే విచారించారు సిట్ అధికారులు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మొదలైన ఉద్యమానికి తాను ఊపిరిపోసానని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఉద్యమం కోసం వ్యూహాలు రచించిన అదే గదిలో.. ఇప్పుడు విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆ గదిలోనే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇలా కేసీఆర్ ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్గాల్ని ఆలోచింపజేస్తున్నాయి. చాలా మంది తమ అధినేతకు ఈ పరిస్థితి రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. 5.26 లక్షల మంది స్టూడెంట్లు హాజరవుతున్నారు. 6 రోజుల పర్యటన కోసం ఇవాళ సాయంత్రం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కి వస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నేడు సినీ నటుడు విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి జరుగుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. నేడు ఫాల్గుణ మాసం ప్రారంభమైంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.