Telangana News Updates: తెలంగాణలో వారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం |


ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వెంటనే.. తెలంగాణలో దివ్యాంగులకు ఊరట కలిగించేలా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఆమోదం తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఇకపై దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం చెయ్యవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం జవో 47ని జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగుల కోసం ఒకట్రెండు సీట్లు ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో చూసుకొని.. దివ్యాంగులు అక్కడ కూర్చునేలా ప్లాన్ చెయ్యవచ్చు. లేదంటే.. ఎక్కడైనా కూర్చోవచ్చు. ప్రభుత్వ నిర్ణయంపై దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ ఏమున్నాయి?

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలపై భారీగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో నేటి నుంచి హెల్త్ మిషన్ 100 కార్యక్రమం ఉంటుంది. నేడు వికారాబాద్‌కి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వస్తున్నారు. డిసీసీల ట్రైనింగ్ శిబిరానికి హాజరవుతారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో నేడు హుజురాబాద్‌లో సంసద్ క్రీడా మహోత్సవం జరుగతుంది. నేడు ఫిరాయింపు కేసులో దానం నాగేందర్‌ని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారిస్తారు. నేడు స్వగ్రామమైన నాగర్ క‌ర్నూలు జిల్లా బల్మూరు మండలం, తుమ్మన్ పేటకు విజయ్ దేవరకొండ, ర‌ష్మిక‌ జంట వస్తుంది. ఫామ్‌హౌస్‌లో గృహప్రవేశం చేస్తుంది. వెంకీ అట్లూరి సూర్య 46 సినిమా ఫస్ట్ లుక్ నేడు ఉదయం 10.18కి రిలీజ్ అవుతుంది. T20 ప్రపంచ కప్‌లో నేడు మ్యాచ్‌లు లేవు. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.



Source link

Spread the love