బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని తెలంగాణ ఈగల్ టీమ్ భగ్నం చేసింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని తెలియడంతో పోలీసులు దాడి చేశారు. వెంటనే నమిద్ మిశ్రా అనే వ్యక్తి పోలీసులపై 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఐతే.. పోలీసులు జాగ్రత్తగా అడ్డుకొని.. పరిస్థితిని కంట్రోల్ చేశారు. SOT పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారు. ఆయనకు డ్రగ్ టెస్టులో నెగెటివ్ వచ్చింది. మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు మహిళ అని తెలిసింది. ఆమె కౌశిక్ రవితో వచ్చినట్లు తెలిసింది. కాల్పులు జరిపిన నమిద్ మిశ్రా ఢిల్లీ వ్యాపారి అని తెలిసింది. ఆ తుపాకీ.. రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిది అని తెలిసింది. ఈ దాడిలో పోలీసులు ఖరీదైన మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. నిందితుల బ్లడ్ శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాప్‌కి పంపినట్లు చేవెళ్ల డీసీపీ తెలిపారు.
ఇవాళ ఏమున్నాయి?
ఇరాన్ యుద్ధానికి 15 రోజులు పూర్తి అయ్యింది. ఇవాళ 16వ రోజు కొనసాగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్.. యూసఫ్‌గూడ లోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతుంది. పాతాళ భైరవి సినిమాకి నేటితో 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. నేడు రాత్రికి ఆకాశంలో గామా నామిడ్స్ ఉల్కాపాతం కనిపిస్తుంది. ఇవాళ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.