సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తెలంగాణ కేబినెట్ మేడారంలో జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మేడారం వెళ్తున్నారు. అక్కడే కేబినెట్ సమావేశం కూడా పెట్టుకోబోతున్నారు. మేడారాన్ని ఎలా అభివృద్ధి చేసిందీ ఈ సమావేశంలో చర్చిస్తారు. అడవిలో జరిగే ఈ మీటింగ్‌పై బాగానే చర్చ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్.. 18న సాయంత్రం వేళ మేడారం వెళ్తారు. 19న ఉదయం 7 గంటలకు గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించి… సభలో ప్రసంగిస్తారు. ఇలా అడవిలో కేబినెట్ పెట్టడం ద్వారా.. ఈ ప్రభుత్వం ప్రజలతోనే ఉంటుందనీ, ప్రజాపాలనకు నిదర్శనంగా ఉంటుందని ప్రభుత్వం చెప్పాలనుకుంటోంది.
నేడు ముక్కనుమ పండుగ. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి.. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కి శంకుస్థాపన చేస్తారు. పరేడ్ గ్రౌండ్‌లో రెండో రోజు హాట్ ఎయిర్ బెలూన్ షో ఉంటుంది. నేడు ప్రధాని మోదీ బెంగాల్ వెళ్తున్నారు. మాల్డాలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే ఆయన ఇవాళ అసోంకి కూడా వెళ్తున్నారు. అక్కడి బాగురుంబా ద్వౌ కార్యక్రమానికి హాజరవుతారు. ప్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభమైంది. ఇలా ఏవి జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ చూద్దాం.