TEPA ఒప్పందం: ‘టెపా’ ఒప్పందం ఎవరికి అనుకూలం?


ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్‌టీఏ-ఎఫ్‌టా)తో మనదేశం వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టెపా) కుదుర్చుకుంది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి టెపా అమల్లోకి వచ్చింది. ఇదొక చరిత్రాత్మక విజయమని ఎల్లెడల ప్రశంసలు కురిశాయి. భారత్‌కు భారీగా పెట్టుబడులు వస్తాయనీ, ఉద్యోగాలు పుట్టుకొస్తాయన్న ప్రచారం జరిగింది. ఈ ఒప్పందంతో మన దేశానికి నిజంగా లాభమేనా?

దహారేళ్ల సుదీర్ఘ చర్చల తరవాత టెపా ఒప్పందం కుదిరింది. దీనికింద ఎఫ్‌టా స్విట్జర్లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, ఐస్‌లాండ్ వంటి దేశాలు వచ్చే పదిహేనేళ్లలో 10వేల కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) పెడతాయని ప్రకటన. భారత్‌లో పది లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు. కానీ, ఈ ఒప్పందాన్ని లోతుగా గుర్తించే ఎఫ్‌టా దేశాలు భారత్‌లో కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టబోవడం లేదని, నూతన సాంకేతికతలనూ బదిలీ చేయబోవడం లేదన్న సంగతి అర్థమవుతుంది. ఎందుకంటే, వాగ్దానాల నుంచి తప్పించుకునే క్లాజులు ఒప్పందంలోనే ఉన్నాయి. 2000-2024 మధ్య నాలుగు ఎఫ్‌టా దేశాలు భారత్‌లో పెట్టిన మొత్తం పెట్టుబడులు 1180 కోట్ల డాలర్లకు మించవు. గడచిన దశాబ్దంలో అవి ఏటా అందించిన ఎఫ్‌డీఐ 86కోట్ల డాలర్లు మాత్రమే. తాజాగా టెపా కింద చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటే ఎఫ్టా వార్షిక ఎఫ్‌డీఐ ఏడు రెట్లు పెరగాల్సి ఉంటుంది. ఒప్పందం కుదిరిన తరవాత ఈ ఏడాది కాలంలో ఎఫ్టా దేశాల నుంచి భారత్‌కు అందిన పెట్టుబడులు 33.4కోట్ల డాలర్లు మాత్రమే. ఈ లెక్కన 10వేల కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐ ఎప్పటికి వస్తుందోనన్న సందేహం వ్యక్తమవుతోంది. 2021లో ఒక స్విస్ హోల్డింగ్ కంపెనీ ద్వారా జర్మనీ సంస్థ బాష్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. దాని ఖర్చు 400 కోట్ల డాలర్లు అయినా కొత్త పెట్టుబడులేవీ రాలేదు. ఈ లావాదేవీతో ఇండియాలో స్విస్ పెట్టుబడులు పెరిగినట్లు మాత్రం కనిపించింది. దీన్ని మినహాయిస్తే భారత్‌లో ఎఫ్‌టా దేశాల పెట్టుబడులు ఏడాదికి 40 కోట్ల డాలర్లను మించవు.

కాలయాపనకు అవకాశం

భారత్‌లో 2015-24 మధ్యకాలంలో ఎఫ్‌టా దేశాల పెట్టుబడుల్లో మూడోవంతు మాత్రమే పారిశ్రామిక రంగంలో ప్రవహించింది. మన పరిశ్రమలకు అధునాతన సాంకేతికతలు అందుతాయనుకున్న ఆశలు నెరవేరలేదు. 2020 తరవాత ఈఎఫ్‌టీఏ దేశాలు మన పరిశ్రమల్లోకన్నా బీమా, ఫైనాన్స్‌ రంగాల్లోనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. స్విట్జర్లాండ్‌ పరిశ్రమల విలీనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఆ దేశం నుంచి బయటికి ఎఫ్‌డీఐల ప్రవాహం తగ్గిపోయింది. ఫలితంగా ఇతర దేశాల్లో కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకురావడం లేదు. ఇండియాకు తప్పనిసరిగా అధునాతన సాంకేతికతలను బదిలీ చేయాలన్న నిబంధన ఒప్పందంలో లేదు. అందువల్ల ఈఎఫ్‌టీఏ దేశాల కంపెనీలు భారతీయ సంస్థలకు అధునాతన సాంకేతికతలను అందించే అవకాశం లేదు. వాటి సామర్థ్య పెంపునకు భాగస్వాములుగానూ వ్యవహరించారు. ఏబీబీ ఇండియా, నెస్లే ఇండియా, గివౌడాన్‌ ఇండియా వంటి స్విస్‌ కంపెనీలు ఇక్కడ ఆర్జించిన లాభాలను స్వదేశానికి తరలిస్తాయే తప్ప అధునాతన సామర్థ్యాలను బదిలీ చేయడం లేదు.

టెపా క్లాజులను చూస్తే ఎఫ్‌టా దేశాలు నేరుగా భారత్‌లో పెట్టుబడులు పెట్టకపోయినా ఫర్వాలేదు అన్నట్టున్నాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాల నుంచి స్విట్జర్లాండ్‌ గుండా భారత్‌కు వచ్చిన పెట్టుబడులను కూడా ఎఫ్‌టా పెట్టుబడులుగా పరిగణించడం మరో విషయం! దీనివల్ల ఒప్పందం కింద భారత్‌లో పెట్టాల్సిన 10వేల కోట్ల పెట్టుబడుల పెట్టుబడిలో వాటినీ భాగంగా చూపించవచ్చు. యుద్ధాలు మహమ్మారులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు, భారత్‌లో పెట్టుబడులు పెట్టనక్కర్లేదనే నిబంధన కూడా ఉంది. ఒప్పందం కింద పెట్టాల్సిన పెట్టుబడులను ఈఎఫ్‌టీఏ దేశాలు భారత్‌లో పెట్టుకున్నా, ఇతర నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేకపోయినా చేసేదేమీ లేదు. చర్చల పేరుతో కనీసం రెండు దశాబ్దాలపాటు కాలయాపన చేయడానికి టెపా అవకాశం కల్పిస్తోంది. స్విస్‌ బహుళజాతి సంస్థలు ప్రపంచమంతటా 25 లక్షల ఉద్యోగాలు సృష్టించినా, గత పదేళ్లలో పారిశ్రామిక కొలువులు 14 లక్షలకు మించడం లేదు. కాబట్టి టెపా కింద ఈఎఫ్‌టీఏ దేశాలు భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయని ఆశించడం అత్యాశే. ఈఎఫ్‌టీఏ దేశాలు వివిధ కంపెనీల స్వాధీనానికీ, విలీనానికే ప్రాధాన్యత ఇస్తాయి. అందుకని, ఉన్న ఉద్యోగులే అటూఇటూ సర్దుబాటు అవుతారు, తప్పించి కొత్త ఉద్యోగాలు రాకపోవచ్చు. 10వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు చట్టపరంగా తప్పనిసరి కాదనీ, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలనేది తమ కంపెనీలను స్విస్ ప్రభుత్వం శాసించలేదని చెప్పారు. స్విస్‌ పాడి ఉత్పత్తులను అనుమతించబోమని భారత్‌ చెబుతున్న వాటిని మనతోపాటు చైనా, లాటిన్‌ దేశాలకు అంటగట్టే ప్రయత్నం జరుగుతుంది. అధిక పెట్టుబడులతో పని పూర్తి చేయడానికి స్విస్ ప్రయత్నిస్తుంది.

భారత్ కర్తవ్యమిదే

మనదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పటి నుంచి ఎఫ్‌డీఐలన్నీ మంచివనీ, అవెంత ఎక్కువగా వస్తే అంత లాభమనే భావన. దాంతో చిన్న పరిశ్రమలు సహా అన్ని రంగాల్లోకి ఎఫ్‌డీఐలు చొరబడ్డాయి. విదేశీ వస్తువులూ సాంకేతికతలతో ఇండియా కిక్కిరిసిపోతోంది. స్వదేశీ శుష్కనినాదంగా మారుతోంది. లాభంకన్నా నష్టమే ఎక్కువైంది. చైనా కీలకమైన రంగాల్లోనే ఎఫ్‌డీఐనీ, ఆధునిక సాంకేతికతలను ఆహ్వానించింది. తమ దేశంలో బృహత్తర కంపెనీలను అభివృద్ధి చేసింది. టెపా ఒప్పందాన్ని కూడా ఇండియా తనకు అనుకూలమైన రీతిలో మలచుకుని ఎదగాలి. ఈ ఒప్పందం కింద పెట్టాల్సిన పెట్టుబడుల్లో కొత్త ప్రాజెక్టులను మాత్రమే తీసుకుంటామని ఢిల్లీ స్పష్టం చేయాలి. ఫైనాన్స్‌ రంగం కాని విభాగాల్లోని పెట్టుబడులను షేర్‌మార్కెట్‌ పెట్టుబడులుగా పరిగణించాలి. ఈఎఫ్టీఏ దేశాల ద్వారా ఇతర దేశాల పెట్టుబడులు, సాంకేతికతలు భారత్‌లోకి ప్రవేశిస్తే టెపా కింద గుర్తించకూడదు. నికర పెట్టుబడులు, సాంకేతికతల బదిలీ, కొత్త ఉద్యోగాల సృష్టి వంటివాటిని సంయుక్త నిర్వహణ ద్వారా నిర్ధారించాలి.



Source link

Spread the love