TG Mee Seva Services : తెలంగాణలో మీసేవా కేంద్రాలు బంద్ – మళ్లీ యాక్టివ్‌ ఎప్పుడంటే..?


మీ-సేవా (MeSeva) సర్వీసులకు సంబంధించి కీలక అలర్ట్ వచ్చింది. 36 గంటల పాటు ఆయా కేంద్రాలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న మీసేవా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, సాంకేతిక హంగులతో మెరుగైన సేవలు అందించేందుకు ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌లోడ్‌, మెయింటెనెన్స్‌ కారణంగా మీసేవ వెబ్‌సైట్‌ షట్‌డౌన్ కానుంది.

మీ-సేవా కేంద్రాలు
మీ-సేవా కేంద్రాలు

మీ-సేవా పోర్టల్‌లో కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేయడం , డేటా సెంటర్ల వార్షిక నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని మీ-సేవా కేంద్రాలతో పాటు, ఆన్‌లైన్ ద్వారా చేసుకునే దరఖాస్తులు కూడా నిలిచిపోతాయి. ఆ తర్వాత మీ-సేవా వెబ్‌సైట్ సేవలు పునరుద్ధరణ జరుగుతుంది.

కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత సోమవారం ఉదయం నుంచి ప్రజలు యథావిధిగా అన్ని రకాల సేవలను పొందవచ్చు. ఈ 36 గంటల ఎలాంటి సేవలు కూడా అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు సహకరించాలని కోరారు. దీనిని గమనించి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో వాట్సాప్ మీసేవా సేవలు కూడా బంద్ అవుతాయని తెలిపారు.

రాష్ట్రంలో పలు రకాల సర్టిఫికెట్లను మీ సేవ ద్వారా పొందవచ్చు. ఈ సర్వీస్ ద్వారా జనాలు మీ సేవకు వెళ్లి కావాల్సిన పత్రాలను అప్లై చేసుకుంటున్నారు. ఇందుకుగానూ ఛార్జీలను వసూలు చేస్తారు. ఇటీవలనే మీసేవా కేంద్రాల్లో సర్వీసుల ధరలను పెంచింది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.కేటగిరీ-ఎ, కేటగిరీ-బి కింద వచ్చే దాదాపు అన్ని సేవలపై కూడా భారం పడింది. మీ సేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, ఆపరేటర్ల విజ్ఞప్తుల మేరకు ఈ ధరల సవరణ చేపట్టినట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి.



Source link

Spread the love