TG news: క్రీడలతో మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యం: గవర్నర్‌ శివప్రసాద్‌ శుక్లా


భువనగిరి: క్రీడలు వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు దేశ ప్రతిష్ఠను కూడా పెంచుతాయని తెలంగాణ గవర్నర్ శివప్రసాద్ శుక్లా అన్నారు. భువనగిరి పార్లమెంటు స్థాయిలో ‘ప్రధాని ఖేల్ మహోత్సవ్‌’ బహుమతి ప్రదానోత్సవం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు శరీర దారుఢ్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఖేలో ఇండియా కార్యక్రమాలు దేశ యువతలో స్ఫూర్తి నింపుతాయని తెలిపారు. కేంద్రమంత్రి బి.ఎల్. వర్మ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతోపాటు మణిపుర్‌లో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.



Source link

Spread the love