మాజీ సీఎం జగన్ ఏపీ సర్వనాశనం కావాలని కోరుకుంటున్నట్టే. తనలోని కుట్రలను బయటపెట్టేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవాలని కోరుకుంటున్నారేమో. ఎందుకంటే ఆయన మాటలు, ప్రకటనలు అలాగే ఉంటున్నాయి మరి. ఇన్నేళ్లలో జగన్ ఒక్కసారి కూడా అమరావతిని రాజధానిగా ఉండటానికి ఇష్టపడలేదు. కానీ తన అనుచరులతో మాత్రం తాను అమరావతికి వ్యతిరేకం కాదని బయటకు చెబుతున్నారు. కానీ ఆయన ప్రెస్ మీట్‌లో మాత్రం అమరావతిని ఒక్కసారి కూడా రాజధానిగా ఉండటానికి ఇష్టపడుతున్నట్టు చెప్పట్లేదు. మొన్నటికి మొన్న మావిగన్ అనే పేరు తీసుకొచ్చారు. నిజానికి జగన్ కు అమరావతి అంటే పేరు పలకడమే ఇష్టం లేదు.
ఎందుకంటే అమరావతి అనేది హిందూ దేవతల పేరు కదా. అందుకే ఆ పేరును పలకడం ఇష్టం లేక తానే సొంతంగా మావిగన్ అనే పేరును తీసుకొచ్చారు. నీళ్లలో మునిగిపోతుందని.. ఒక్క బిల్డింగ్ కట్టలేరని.. భారీగా బడ్జెట్ కావాలని.. అమరావతి రాజధాని అమరావతి అసాధ్యం అని.. ఇలా లెక్కలేనన్ని కుట్రలను మొన్న ప్రెస్ మీట్ లో బయటపెట్టారు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత రావొద్దని బలంగా కోరుకుంటున్నాను. అందుకే పార్లమెంట్ లో కూడా అమరావతికి తన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు.
మొన్నటి వరకు అమరావతిపై సైలెంట్ గా ఉన్న జగన్.. ఇప్పుడు మళ్లీ ఫేక్ ప్రచారాలు, తప్పుడు ప్రకటనలతో అమరావతిపై కొత్త తరహా కుట్రలకు తెర తీస్తున్నారు. ప్రజల్లో అమరావతి మీద వ్యతిరేకత రావాలన్నదే జగన్ ప్లాన్ అని తెలిసిపోతోంది. కానీ ఆ పరిశీలన మాత్రం జగన్ నేరుగా ఒప్పుకోవట్లేదు. పైకి మాత్రం అమరావతికి వ్యతిరేకం కాదంటున్నారు. కానీ చేసే ప్రతి ప్రకటన కూడా అమరావతికి వ్యతిరేకంగానే ఉంటున్నది అందరూ గమనిస్తున్నారు. కాబట్టి జగన్ ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా సరే ప్రజలు ఆయన్ను నమ్మరు.. అమరావతికే మద్దతు పలుకుతున్నారనేది గుర్తుంచుకోవాలి.